సంప్రదాయబద్ధంగా సీతమ్మ వాకిట్లో .. ఆడియో

సంప్రదాయబద్ధంగా సీతమ్మ వాకిట్లో .. ఆడియో

Published on Dec 14, 2012 8:32 AM IST

SVSC
దాదాపు సంవత్సర కాలం నుండి వెంకటేష్, అభిమానులు, మహేష్ బాబు అభిమానులే కాకుండా సాధారణ సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక మల్టిస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలకు ముస్తాబవుతోంది. సినిమా విడుదలకు ముందుగా జరిగే ఆడియో విడుదల కార్యక్రమం సాధారణ ఆడియో విడుదల లాగా కాకుండా విభిన్నంగా చేయబోతున్నారు. తెలుగుతనానికి సంభందించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో బుర్ర కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా లాగే వేడుకను కూడా సంప్రదాయాలను గుర్తుచేయడానికి ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పనుల్లో బిజీగా చిత్ర బృందం ఆడియో విడుదల తరువాత ఒక పాట చిత్రీకరణ కోసం కేరళ వెళ్లనుంది. వెంకటేష్, అంజలి మీద ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తారు. ఈ పాటతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు