ఈ వారం కూడా ఆ రెండు సినిమాలదే హవా.!

ఈ వారం కూడా ఆ రెండు సినిమాలదే హవా.!

Published on Jan 17, 2013 10:27 PM IST

svsc-and-nayak
ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వచ్చి టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడం షరామామూలే. అలాగే ఈ సంవత్సరం కూడా రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, వి.వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘నాయక్’ సినిమా. సంక్రాంతి బరిలో దిగిన మొదటి సినిమా ఇది, మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మంచి టాక్ తో ప్రదర్శించబడుతూ మొదటి వారం రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకుంది.

విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా వచ్చిన ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సంక్రాంతి బరిలో వచ్చిన మరో పెద్ద సినిమా. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటూ మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమాలకు జోరుకి బ్రేకులు వేయలేమనే ఉద్దేశంతో ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద తెలుగు సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. కావున ఈ వారం ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హవాని కొనసాగించనున్నాయి. ఈ సినిమాలకున్న క్రౌడ్స్ ఇలాగే కొనసాగితే ఈ వారం కూడా రికార్డ్ స్థాయిలోనే కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు