లాస్ ఏంజల్స్ లో ఎస్.వి కృష్ణా రెడ్డి సినిమా ప్రీమియర్ షో

లాస్ ఏంజల్స్ లో ఎస్.వి కృష్ణా రెడ్డి సినిమా ప్రీమియర్ షో

Published on May 12, 2013 2:00 PM IST

SV_Krishna_Reddy
తెలుగు ఫేమస్ కామెడీ చిత్రాల దర్శకుడు ఎస్.వి కృష్ణా రెడ్డి డైరెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ ‘డివోర్స్ ఇన్విటేషన్’ మే లోనే విడుదల కావడానికి సిద్దమవుతోంది. 1997లో విడుదలైన తెలుగు సినిమా ‘ఆహ్వానం’ కి రీమేక్. ఈ చిత్ర ఇంగ్లీష్ వెర్షన్ లో జోనాథన్ బెన్నెట్, జామీ – లైన్ సిగ్లెర్, నదియా బ్జోర్లిన్, ఎల్లిఒట్ గ్లౌడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘బిజినెస్ మేన్’,’డమరుకం’ లాంటి సినిమాలు తీసిన డా. వెంకట్ ఈ సినిమాని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్ షో లాస్ ఏంజల్స్ లో జరగనుంది. ఈ షో రెడ్ కార్పెట్ పై ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతికనిపుణులు నడవనున్నారు. చాలా కాలం క్రితమే’డివోర్స్ ఇన్విటేషన్’ ని అనౌన్స్ చేసారు అలాగే సినిమా షూటింగ్ పూర్తయ్యి కూడా చాలా కాలం అయ్యింది. ఎడ్ బర్గైరేనా – లెన్ని స్టెప్ బున్ లు సంగీతం అందించారు. ఈ సినిమాని సుమారు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

తాజా వార్తలు