సుశాంత్ కేసులో రియాను తప్పించేందుకు పోలీసు సాయం?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కె కె సింగ్ బీహార్ లో హీరోయిన్ రియా చక్రవర్తిపై కేసు పెట్టడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో రియా ప్రేమేయం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న బీహార్ పోలీసులు ఆమె నివాసానికి వెళ్లగా ఆమె అక్కడ లేకపోవడం కలకలం రేపింది. దీనితో బీహార్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే సుశాంత్ సింగ్ అకౌంట్ లోని 15 కోట్ల రూపాయలు కూడా ఆయన మరణానికి ముందు ట్రాన్స్ఫర్ కావడం సంచలనంగా మారింది.

సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో ఎవరికీ తెలియని మరో కోణం ఉందన్న వాదన వినిపిస్తుంది. అలాగే సుశాంత్ సింగ్ లాయర్ ఈ కేసు విషయంలో ఎవరోపోలీసు అధికారి రియాకు సాయం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను కేసు నుండి బయటపడేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా సుశాంత్ ఆత్మ హత్య వెనుక పెద్ద వ్యవహారమే ఉందన్న వాదన వినిపిస్తుంది.

Exit mobile version