‘అడ్డా’ సినిమాపై ఆశలు పెట్టుకున్న సుశాంత్

‘అడ్డా’ సినిమాపై ఆశలు పెట్టుకున్న సుశాంత్

Published on Apr 7, 2013 2:17 AM IST

Adda-Telugu-Movie

గత నాలుగు సంవత్సరలుగా సుశాంత్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. తన నటించిన రెండు సినిమాలు ‘కాళిదాసు’, ‘కరెంటు’లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకునంత విజయాన్ని సాదించలేకపోయాయి. అప్పటి నుండి తను ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ సంవత్సరం తను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘అడ్డా’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని ఈ మధ్యే విడుదల చేశారు. ఈ సినిమాలో తను చూడడానికి కొత్త గా కనిపిస్తున్నాడు. గత కొద్ది రోజులకు ముందు జరిగిన ఇంటర్వ్యూ లో సుశాంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ -ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిని త్వరలో విడుదల చేస్తాం అన్నాడు. ‘ఈ సినిమాలో హీరో పాత్ర చాలా ప్లాట్ గా వుంటుంది. యూత్ ని టార్గెట్ గా చేసుకొని ఈ సినిమాని నిర్మించాం. నేను ఈ సినిమాలో యంగ్, కాన్ఫిడెంట్, డైనమిక్ పాత్రలో నటించాను. ఇలాంటి పాత్రని ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో ఎవరు చేయలేదని’ అన్నాడు.

జీ. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నాగ సుశీల – చింతలపూడి శ్రీనివాస రావు లు నిర్మిస్తున్నారు. అనుప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా లో సుశాంత్ తో పాటుగా శాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ‘లాక్ యువర్ లవ్’ అనే కాప్షన్ తో వస్తున్న ఈ సినిమా మే చివర్లో విడుదల చేయనున్నారు .

తాజా వార్తలు