సూర్య ‘సింగం’ సినిమా వాయిదాపడనుందా?

సూర్య ‘సింగం’ సినిమా వాయిదాపడనుందా?

Published on Jun 17, 2013 10:30 PM IST

SINGAM--(1)
తాజా తమిళ వర్గాల కధనాల ప్రకారం తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న ‘సింగం’ సినిమా ఒక వారం వాయిదాపడనుంది. ఈ వాయిదాకు కారణం పోస్ట్ ప్రొడక్షన్ లో జరుగుతున్న జాప్యమేనట. ఈ సినిమాను ఇప్పుడు జూలై 12న విడుదల చెయ్యడానికి చూస్తున్నారు. ఈ వార్త ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది.

ఈ సినిమాలో అనుష్క మరియు హన్సిక హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.

ఈ సినిమా మన రాష్ట్రంలో విడుదలై ఆదరణ పొందిన ‘యముడు’ సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఇందులో సూర్య ఒక నీతిగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నాడు.

ఈ సినిమాకు హరి దర్శకుడు, కధకుడు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు

తాజా వార్తలు