తమిళ హీరో సూర్య నటిస్తున్న చిత్రాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఎలాగైనా సూర్య ఒక్క హిట్ కోసం తీవ్రంగా కష్ట పడుతున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీలో సూర్య డబుల్ బ్లాస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట.
తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తో సూర్య ఇటీవల తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాడట. ఇందులో ఒకటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. గతంలో ’24’ మూవీలో ఆత్రేయ పాత్రలో సూర్య మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి తరహా పాత్రలో ఆయన కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది.
మరి నిజంగానే సూర్య చేయబోయే డబుల్ రోల్స్ ఈ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.