మొండిగా ముందుకు వెళుతున్న స్టార్ హీరో

హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగా ఉన్నారు. అలాగే కొంత మంది చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను ఆన్లైన్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో సూర్యపై థియేటర్ల యాజమాన్యం రెడ్‌ కార్డ్‌ను వేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను తమ థియేటర్‌లలో విడుదల చేయబోమని తీర్మానం చేశారు. అలాగే కేరళ సినీ థియేటర్ల సంఘం కూడా సూర్య నిర్మించే, నటించే చిత్రాలను విడుదల చేయబోమని తెలియజేసింది.

ఐతే వారు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సూర్య మొండిగా ముందుకు వెళుతున్నాడు. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన సురారై పోట్రు త్వరలో విడుదల కావాల్సివుంది. ఈ సమయంలో థియేటర్స్ అసోసియేషన్స్ తో గొడవలు పెట్టుకుంటే సూర్య సినిమాలకు నష్టం వాటిల్లే సూచనలు కలవు.

Exit mobile version