‘కూలీ’ నుంచి సర్‌ప్రైజ్‌.. ఓటీటీలోకి ఆడియో లాంచ్ !

‘కూలీ’ నుంచి సర్‌ప్రైజ్‌.. ఓటీటీలోకి ఆడియో లాంచ్ !

Published on Aug 11, 2025 3:00 PM IST

coolie

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పాటలు, ప్రత్యేక వీడియోలు పంచుకున్న టీమ్‌ ఇప్పుడు రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. చెన్నై వేదికగా కూలీ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఐతే, ఈ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ను ఓటీటీలోకి తీసుకొచ్చింది. సన్ నెక్స్ట్ వేదికగా ఈ వేడుక అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

కాగా ఈ ఈవెంట్‌ లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఫన్నీ స్పీచ్‌తో పాటు ఇతర నటీనటులు పంచుకున్న విశేషాలను, అదేవిధంగా సంగీత దర్శకుడు అనిరుధ్‌ పెర్ఫామెన్స్‌ను ‘Coolie Unleashed’ పేరుతో సన్ నెక్స్ట్ వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘కూలీ’ రాబోతుంది. పైగా అక్కినేని నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

తాజా వార్తలు