డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటించనున్న సూర్య

డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటించనున్న సూర్య

Published on Dec 7, 2013 5:30 PM IST

Surya
ఆంధ్ర ప్రదేశ్ లో మంచి మార్కెట్ వున్న అతి కొద్ది మంది తమిళ్ నటుల్లో సూర్య ఒకరు . సూర్య తాజా చిత్రాలు యముడు, సింఘం (యముడు 2) తెలుగు లో మంచి స్పందన ను రాబట్టుకున్నాయి. సూర్య నటించిన రక్త చరిత్ర 2 చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి . తన కెరీర్ లో మొదటి సారిగా డైరెక్ట్ గా ఒక తెలుగు చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

యముడు, సింఘం చిత్రాన్ని నిర్మించిన కె యి జ్ఞానవేల్ రాజ, సూర్య డైరెక్ట్ గా తెలుగు లో నటిస్తున్న చిత్రం ఆగష్టు లో మొదలుకానుంది అని, తనే ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాని తెలిపారు. ఒక మీడియా సమావేశం లో మాట్లాడుతూ “చాలా మంది సూర్య డైరెక్ట్ తెలుగు చిత్రం లో ఎప్పుడు నటిస్తారు అని అడుగుతున్నారు. సూర్య వచ్చే ఏడాది ఆగష్టు నుంచి తెలుగు చిత్రం షూటింగ్ లో పాల్గోనున్నారు ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ తెలుగు దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం.”

తాజా వార్తలు