ఫైనల్ గా క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టిన సూర్య..!

ఫైనల్ గా క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టిన సూర్య..!

Published on Jun 11, 2025 3:00 PM IST

మన టాలీవుడ్ అడాప్టెడ్ సన్ సూర్య హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. సూర్య కెరీర్లో 46వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ చిత్రం మంచి బజ్ ని కూడా ఆల్రెడీ సొంతం చేసుకుంది. ఇక మొత్తానికి ఈ అవైటెడ్ క్రేజీ కలయిక నేటి నుంచి పట్టాలెక్కేసింది. మేకర్స్ అధికారికంగా తమ సినిమా సెట్స్ లోకి వెర్సటైల్ హీరో సూర్య అడుగు పెట్టినట్టుగా అనౌన్స్ చేసేసారు.

దీనితో ఈ ఫీల్ గుడ్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పట్ల అభిమానులు మరింత నమ్మకం పెట్టుకున్నారు. లక్కీ భాస్కర్, సార్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీ అట్లూరి సూర్యకి కూడా సాలిడ్ హిట్ ఇస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. మరి వీరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు