కోలీవుడ్ లో బాక్సాఫీస్ ను తన ప్రతీ సినిమాతో భీభత్సంగా షేక్ చెయ్యగలిగే టాప్ హీరోలలో థలా అజిత్ కూడా ఒకరు. దర్శకుడు శివ తో తీసిన “విశ్వాసం” భారీ హిట్ అయిన అనంతరం మొదలు పెట్టిన ప్రాజెక్ట్ “వేళైమై”. భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రానికి వినోద్ హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం అజిత్ అక్కడి మరో స్టార్ హీరో సూర్య డైరెక్టర్ తో చిత్రం తీయనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశమే నీ హద్దురా” డైరెక్టర్ సుధా కాంగ్ర థలా అజిత్ ను డైరెక్ట్ చేయనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ లేడీ డైరెక్టర్ తీసిన “ఆకాశమే నీ హద్దురా” డిజిటల్ రిలీజ్ కోసం చాలా మందే ఎక్కువ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ డైరెక్టర్ అజిత్ తో ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్లాన్ చేశారో తెలియాల్సి ఉంది. సూర్య నటిస్తున్న “ఆకాశమే నీ హద్దురా” చిత్రం అమెజాన్ ప్రైమ్ లో వచ్చే అక్టోబర్ 30 డిజిటల్ గా రిలీజ్ కానుంది.