సూర్య “ఆకాశమే నీ హద్దురా” ట్రైలర్ కు ముహూర్తం.!

సూర్య “ఆకాశమే నీ హద్దురా” ట్రైలర్ కు ముహూర్తం.!

Published on Oct 2, 2020 4:00 PM IST

కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరో సూర్యకు అక్కడి తో పాటు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో సూర్యను మన వాళ్ళు ఎంతగానో ఓన్ చేసుకున్నారు. అలా తన ప్రతీ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ తో సూర్య తెలుగులో కూడా మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు. అయితే ఇపుడు సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశమే నీ హద్దురా” కూడా విడుదలకు రెడీగా ఉంది.

లాక్ డౌన్ మూలాన థియేటర్స్ మూతపడడంతో ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు భారీ ధరకు కొనుగోలు చేసి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ రెడీ చేస్తున్నారు. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం టీజర్ వచ్చే వారంలో చిత్ర యూనిట్ విడుదల చేయనున్నారట.

అందుకు సంబంధించి పనులు పూర్తయ్యాక డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సుధా కాంగ్ర దర్శకత్వం వహించగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. అన్నట్టు ఈ చిత్రంలో సూర్య తెలుగు వెర్షన్ డబ్బింగ్ కు టాలెంటెడ్ హీరో సత్యదేవ్ అందిస్తున్నారు.

తాజా వార్తలు