3డీ సినిమాలో నటించడానికి సిద్దమవుతున్న సూర్య?

3డీ సినిమాలో నటించడానికి సిద్దమవుతున్న సూర్య?

Published on Jan 20, 2014 12:30 PM IST

Surya
తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం ‘అంజాన్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తరువాత సూర్య డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నాడు. వెంకట్ ప్రభు సూర్య తమ్ముడు కార్తితో కలిసి ‘ఆవకాయ బిర్యాని’ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మధ్య తమిళనాడులో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వెంకట ప్రభు ఈ సినిమాని 3డీ లో తీయనున్నాడని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ 3డీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. దీనికి సంబదించిన వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకి ”కళ్యాణరామన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని కానీ ఇది ఫైనల్ కాదని మరికొన్ని పేర్లను కూడా వారు పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని ఒక కొత్త ఎంటర్టైనర్ గా ఇప్పటి వరకు తమిళ్ లో రాని విదంగా రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు