సూపర్ స్టార్ షూట్ మళ్ళీ పోస్ట్ ఫోన్ !

సూపర్ స్టార్ షూట్ మళ్ళీ పోస్ట్ ఫోన్ !

Published on Oct 11, 2020 11:00 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న తన 168వ సినిమా షూటింగ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అసలు ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారా.. లేదా.. అని రజిని అభిమానులు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. అయితే రజిని వయసు రిత్యా షూటింగ్ ఇప్పట్లో చేయకపోతేనే బెటర్ అనే ఫిలింగ్ లో మేకర్స్ ఉన్నారని టాక్.

అయితే నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలని, రజిని లేని సీన్స్ ను ముందుగా తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ ప్లాన్ ను కూడా విరమించుకున్నారు. ఈ సీన్స్ ను కూడా వచ్చే ఏడాది స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే శివ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట.. ఇక రజిని మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. సో.. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

తాజా వార్తలు