భీమవరం బుల్లోడిగా సునీల్

Sunil Birthday

సునీల్ ఈ మధ్య బిజీ కధానాయకులలో ఒకడయిపోయాడు. మొన్నే ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ సినిమాలో కనిపించిన తన చేతిలో ఈ ఏడాదికి నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మిస్తున్న సినిమా కూడా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘భీమవరం బుల్లోడు’ అనే టైటిల్ ని అనుకుంటున్నారంట. సునీల్ భీమవరం పేరుతో బాగా ఫేమస్ కనుక ఈ టైటిల్ అతనికి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. దర్శకుడు తేజ కొత్త చిత్రం ‘1000 అబద్దాలు’ లో నటిస్తున్న ఈస్తర్ ఈ సినిమాలో ప్రధాన నాయిక. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version