ఓటీటీలో రిలీజ్ కానున్న ‘దివ్య దృష్టి’.. ఈ కాంబినేషన్‌లో మరో హిట్..?

ఓటీటీలో రిలీజ్ కానున్న ‘దివ్య దృష్టి’.. ఈ కాంబినేషన్‌లో మరో హిట్..?

Published on Dec 4, 2025 10:05 PM IST

Divya drusti

సునీల్, ఇషా చావ్లా గతంలో పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకు వంటి చిత్రాల్లో కలిసి నటించారు. మొదటి సినిమా హిట్ కాగా, రెండోది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ జంట మరోసారి ‘దివ్య దృష్టి’ అనే సినిమాలో జట్టు కట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

ఈ సినిమా హారర్ థ్రిల్లర్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో రూపొందినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ‘దివ్య దృష్టి’ థియేటర్లకు రాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 19 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్‌కు రానుంది.

ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడిగా పేరు పొందిన కబీర్ లాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ కామరాజు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

తాజా వార్తలు