మరోసారి కలిసి నటించనున్న సునీల్ – ఇషా చావ్లా

మరోసారి కలిసి నటించనున్న సునీల్ – ఇషా చావ్లా

Published on Feb 22, 2012 12:26 PM IST


బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘పూలరంగడు’ చిత్ర భారీ విజయం తరువాత ఇషా చావ్లా, సునీల్ మరోసారి కలిసి నటించబోతున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి గాను సునీల్ 3 కోట్లు రేమ్యురేషణ్ తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ‘బ్లేడ్ బాబ్జీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దేవి ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

తాజా వార్తలు