కామెడి హీరో సునీల్ ‘భీమవరం బుల్లోడు’ సినిమా అటు విమర్శకుల వైపు నుండి గానీ ఇటు A సెంటర్ ప్రేక్షకుల నుండి గానీ మంచి స్పందనను అందుకోలేదు. కానీ ఈ సినిమాలో సునీల్ నటనతో B , C సెంటర్ లలో బాగానే ఆడుతుంది
సునీల్ అసలైన మార్కెట్ చిన్న చిన్న ఊర్లలొ, పల్లెల్లోనే ఉంది గనుక ఇక్కడ విజయం సాధించింది. సినిమా మాట ఎలా వున్నా కలెక్షన్ల పరంగా సునీల్ హ్యాపీ అనే చెప్పాలి
బి, సి సెంటర్ లలో, శాటిలైట్ హక్కుల ద్వారా ఈ సినిమా లాభాల పంట పండుతుంది. ప్రస్తుతం సునీల్ తన తదుపరి సినిమా తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వుండనుంది