ఇప్పుడు బిజీ తక్కువ – ఒత్తిడి ఎక్కువ అంటున్న హీరో.!

Mr-Pellikoduku

‘స్వయం వరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై తన శైలి కామెడీతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నటుడు సునీల్. కమెడియన్ అయిన సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని హీరోగా తొలి హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’, ‘పూల రంగడు’ సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్న సునీల్ ప్రస్తుతం కమెడియన్ పాత్రలు చేయడంలేదు. ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీల్ ని హీరోగా ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది అని అడిగితే ‘ హీరోగా కూడా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కమెడియన్ గా చేసేటప్పుడు ఫుల్ బిజీగా ఉండేవాన్ని కానీ ఇప్పుడు ఖాళీ సమయం దొరుకుతోంది, అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని’ సునీల్ అన్నాడు.

సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి హిందీలో వచ్చిన ‘తను వెడ్స్ మను’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘Mr పెళ్ళికొడుకు’ కాగా, రెండవది తమిళ సినిమా ‘సెట్టై’ రీమేక్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్యతో కలిసి సునీల్ తెరపంచుకోనున్నాడు.

Exit mobile version