నర్సీపట్నంలో మొదలయిన సందీప్ కిషన్ చిత్రం

నర్సీపట్నంలో మొదలయిన సందీప్ కిషన్ చిత్రం

Published on Dec 14, 2012 12:45 PM IST

sundeep-kishan
సందీప్ కిషన్ తరువాత చిత్ర చిత్రీకరణ నర్సీపట్నం లో మొదలయ్యింది. అన్ బోస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు ఈ చిత్రాన్ని ఆనంద్ రంగ , శేషు రెడ్డి సంయుక్తంగా రాండమ్ థాట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. నిషా అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. అడ్వెంచర్ లవ్ స్టొరీ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్రం విడుదల కోసం వేచి చూస్తున్నారు. 1986 వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మి మంచు,తాప్సీ, ఆది ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కాకుండా “డి ఫర్ దోపిడీ” మరియు తమిళంలో “యారుడా మహేష్” అన్న చిత్రాల విడుదల కోసం వేచి చూస్తున్నారు.

తాజా వార్తలు