కొలీవుడ్ పై కన్నేసిన సందీప్ కిషన్

కొలీవుడ్ పై కన్నేసిన సందీప్ కిషన్

Published on Feb 10, 2014 2:30 AM IST

Sundeep-Kishan

ఫిలింనగర్ సమాచారం గనుక నిజమైతే త్వరలో సందీప్ కిషన్ పేరు టాలీవుడ్ దాటి వినిపించనుంది. ఈ యువహీరో ప్రస్తుతం ‘రా రా కృష్ణయ్య’ మరియు కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో మరో సినిమాలతో బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు నిర్మాణ దశలోనే వున్నాయి. వీటిలో సందీప్ తమిళ చిత్ర నిర్మాతలను ఆకర్షిషిస్తున్నాడు.

సమాచారం ప్రకారం ఇతనిని కొంతమంది తమిళ చిత్ర దర్శకులు ద్విభాషా చిత్రానికై సంప్రదించారట. ఇంకా ఏ వార్తా అధికారికంగా ధృవీకరించలేదు. బహుశా ఈ సినిమాలు పూర్తయ్యాక సందీప్ ఈ వార్తాలపై స్పందించవచ్చు. తమిళ చిత్ర సీమలో హిట్ కొట్టే అదృష్టం తనకు వుందో లేదో త్వరలోనే చూస్తాం

గతయేడాది సందీప్ తమిళంలో యారుడా మహేష్ అనే సినిమాలో నటించాడు. అది అంత విజయం సాధించకపోయినా ఇక్కడ తను నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఘనా విజయం సాధించి భారీ కలెక్షన్ లను తెచ్చిపెట్టింది

తాజా వార్తలు