సందీప్ కిషన్ ఈ మధ్య చాలా బిజీగా వుంటున్నాడు. కుమార్ నాగేంద్ర తెరకెక్కిస్తున్నఒక చిత్రంలో కాకుండా రా రా కృష్ణయ్య సినిమాలో కూడా ఈ బాబు నటిస్తున్నాడు. రా రా కృష్ణయ్య చిత్రం షూటింగ్ దాదాపు పుర్తికావస్తున్న నేపధ్యంలో ఇప్పుడు తన దృష్టంతా కుమార్ నాగేంద్ర సినిమా పై పెట్టాడు
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ఒక కలర్ ఫుల్ మాస్ పాటను అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని, బ్రహ్మానందం పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సందీప్ కిషన్ తెలిపాడు
ప్రియా బెనర్జీ, రాశీ ఖన్నా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ముఖ్యపాత్రధారులు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. సినిమాలో చాలా భాగం హైదరాబాద్ లోనే తెరకెక్కించారు