విడుదల తేదీ : మే 11, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : అంకిత్ కొయ్య, లాస్య భావన, శివన్నారాయణ తదితరులు
దర్శకుడు : రాంకీ
స్క్రీన్ ప్లే, నిర్మాత : రాఘవేంద్ర రావు బి.ఏ
సంగీతం : జోశ్యభట్ల
ఛాయాగ్రహణం : సునీల్ కుమార్ నామా
కూర్పు : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రస్తుతం ప్రతీ వారం ప్రసారానికి వస్తున్న వీక్లీ సిరీస్ ఎపిసోడ్స్ లో లేటెస్ట్ గా వచ్చిన మరో ఎపిసోడ్ సుందరం గాడి ప్రేమకథ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తన తాత పేరు పెట్టుకున్న సుందర రామ మూర్తి పంతులు (అంకిత్ కొయ్య) ఎలాగైనా ప్రేమించే పెళ్లి చేసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉంటాడు. అలా చాలా మందికి ట్రై చేస్తాడు కానీ తన పేరు మూలాన వారంతా తిట్టుకొని వదిలేస్తుంటారు. దీనితో తన పేరుని సుందర్ అని మార్చేసుకొని ఒక జ్యోతిషుడు చెప్పిన మాటలు నమ్మి తన కలల రాణి కోసం ఎదురు చూస్తాడు. ఇలా కొన్ని నాటకీయ పరిణామాలు తర్వాత సంధ్య (లాస్య భావన) ని కలుస్తాడు. మరి అక్కడ నుంచి లాస్య సుందర్ తో ఎలా నడుచుకుంది? ఆమెని ప్రేమించిన సుందర్ కి చివరిలో ఆమె ఎలాంటి ట్విస్ట్ ఇచ్చింది? చివరికి సుందర్ ప్రేమలో సక్సెస్ అయ్యాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సిరీస్ లో లీడ్ నటీనటులు అంకిత్ కొయ్య అలాగే లాస్య భావనలు మంచి నటన కనబరిచారు అని చెప్పాలి. మెయిన్ గా అంకిత్ నుంచి కొంచెం కొత్త వెర్షన్ అని చెప్పవచ్చు. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాల నుంచి చూస్తే ఇందులో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తాడు.
తన కామెడి టైమింగ్, కామికల్ నటన ఇందులో ఆకట్టుకుంటాయి. అలాగే లాస్య కూడా బాగా చేసింది. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ పలు సీన్స్ లో అయితే రాఘవేంద్రరావు మార్క్ కనిపిస్తుంది. ఇలా ఇద్దరూ మాత్రం బాగానే అలరిస్తారు. ఇక వీరితో పాటుగా అమృతం అప్పాజీ నటుడు శివన్నారాయణ కూడా మంచి నటన కనబరిచారు. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఇపుడు వరకు ఈ కథా సుధాలో వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కంటే ఇది డిఫరెంట్ గా ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు అని చెప్పాలి. ఒక రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా పైగా రాఘవేంద్ర రావు గారి టచ్ లో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.
కథ చాలా రొటీన్ గా ఉంటుంది. ఒక్క రాఘవేంద్ర రావు గారి ఎప్పటిలానే యంగ్ జంట నడుమ రొమాంటిక్ స్టైల్ ని ఇష్టపడే వారికి తప్పితే ఇతర ఆడియెన్స్ కి ఈ ఎపిసోడ్ కనెక్ట్ కాదు. రొటీన్ ప్లాట్ అంత ఎంటర్టైనింగ్ గా సాగని కథనం చూసే వీక్షకుని అంత ఎగ్జైట్ చేయలేవు.
అలాగే సుందరం పాత్రలో అంకిత్ బాగున్నాడు కానీ ఆ రోల్ అంత ఎఫెక్టీవ్ గా లేదు. సో ఈ ఎపిసోడ్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. లైన్ కి తగ్గట్టుగా సెట్ చేసుకున్న సెటప్ అంతా బాగుంది. జోశ్య భట్ల ఇచ్చిన సంగీతం బాగుంది. సునీల్ కుమార్ అందించిన విజువల్స్ బాగున్నాయి. రాఘవేంద్ర వర్మ ఎడిటింగ్ పర్వాలేదు. అలాగే ఈ చిత్రానికి రాఘవేంద్రరావు గారు అందించిన స్క్రీన్ ప్లే తన మార్క్ కోరుకునేవారికి నచ్చుతుంది. కథలో పెద్దగా పస లేదు కాబట్టి దర్శకుడు రాంకీ ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చేసారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సుందరం గాడి ప్రేమకథ’ ఒక రొటీన్ రోమ్ కామ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఒక్క రాఘవేంద్రరావు గారి మార్క్ నటీనటుల పెర్ఫామెన్స్ లు తప్పితే మేటర్ పెద్దగా లేదు. వీటితో ఈ ఎపిసోడ్ మాత్రం ఈ లఘు చిత్రాల కథా సుధలో బిలో యావరేజ్ గా అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team