విడుదల తేదీ : నవంబర్ 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్, షీబా చద్దా, వర్తిక సింగ్, దానిష్ హుస్సేన్ తదితరులు
దర్శకుడు : సుపర్ణ్ ఎస్ వర్మ
నిర్మాత : వినీత్ జైన్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా, హర్మన్ బవేజా
సంగీత దర్శకుడు : విశాల్ మిశ్రా
సినిమాటోగ్రాఫర్ : ప్రథమ్ మెహతా
ఎడిటర్ : నినద్ ఖనోల్కర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ‘హక్’ రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
షజియా బానో(యామీ గౌతమ్)ను పెళ్లాడిన అడ్వకేట్ అబ్బాస్ ఖాన్(ఇమ్రాన్ హష్మి) కొన్ని రోజులు బాగానే ఉంటాడు. అయితే, పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను కాదని, రెండో వివాహం చేసుకుని వస్తాడు. సైరా(వర్తికా సింగ్)ను తన భర్త ప్రేమించే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న షజియా బానో ఎదురిస్తుంది. దీంతో షజియా బానోకు అబ్బాస్ ఖాన్ ట్రిపుల్ తలాఖ్ ఇస్తాడు. అయితే, తనతో పాటు తన పిల్లలకు న్యాయం జరిగాలని షజియా బానో చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
కోర్ట్ రూమ్ డ్రామాలకు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. అలాంటిది, నిజంగా జరిగిన ఓ సెన్సేషనల్ కథను సినిమా రూపంలో ప్రజెంట్ చేస్తే, దానిపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ఈ ‘హక్’ సినిమా రిలీజ్‌కు ముందే మనం చూశాం. కేవలం ట్రైలర్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా.
ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేసేలా మేకర్స్ తీర్చిదిద్దారు. ఓ మిస్లిం మహిళ తనకు భర్త వల్ల జరిగిన అవమానం, అన్యాయాన్ని ఎదురించేందుకు సమాజం, మతం అడ్డుగా ఉన్నా చేసిన పోరాటం నిజంగా అభినందనీయం. కోర్టులోనూ తనకు న్యాయం జరగని సందర్భాల్లో ఆమె ఎలాంటి ధీమా కోల్పోకపోవడం నిజంగా విశేషం.
ఈ సినిమాలో చాలా సీన్స్ నేటి తరానికి తెలియనివి కావడం.. కేవలం కోర్టు ఇచ్చిన సెన్సేషనల్ తీర్పుపైనే అవగాహన ఉండటంతో అంతకు ముందు జరిగిన సన్నివేశాలను ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. యామీ గౌతమ్ బాధితురాలిగా నటించిన తీరు సూపర్.
ఈ సినిమాలో మరో ఆకట్టుకునే అంశం ఇందులోని డైలాగులు. ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాలోని డైలాగులు ఉండటం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇమ్రాన్ హష్మితో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
మైనస్ పాయింట్స్:
ఇందులో కొన్ని డెలికేట్ అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించక పోవచ్చు. అయితే వాటికి జరగాల్సిన న్యాయాన్ని మాత్రం చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక ఇమ్రాన్ హష్మి లాంటి యాక్టర్‌ను కేవలం ఫేమ్ కోసమే వాడుకున్నట్లు ఈ సినిమాలోని ఆయన పాత్ర చూస్తే అర్థమవుతుంది.
కథలో మంచి బలం ఉంది.. కానీ కథనంలో వచ్చే స్లో పేస్, ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. పాటలు కూడా పెద్దగా గుర్తుండేలా లేకపోవడం మరో మైనస్. కొన్ని సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి.
సాంకేతిక విభాగం:
దర్శకుడు సుపర్ణ్ ఎస్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. రియల్ లైఫ్‌లో జరిగిన ఘటన ఆధారంగా ఓ పెను సంచలనాత్మక ఘట్టాన్ని ఆయన ఈ సినిమా ద్వారా తెలపాలని ప్రయత్నించడం బాగుంది. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ వర్క్ మరో ప్లస్ పాయింట్. కోర్టు రూమ్ డ్రామాలతో పాటు ఎమోషనల్ సీన్స్‌ను బాగా చూపెట్టారు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. సంగీతం పరంగా ఇలాంటి సినిమాల్లో పెద్దగా స్కోప్ ఉండదు. అయినా, ఇందులోని బీజీఎం వర్కవుట్ అయింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా ‘హక్’ మూవీ నిజజీవతంలో జరిగిన రియల్ కథను రీల్ కథగా ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కోర్టు రూమ్ డ్రామాలకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి. యామీ గౌతమ్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను క్యారీ చేసిన విధానం సూపర్. అయితే, ఇలాంటి కథలో కొన్ని సీన్స్ అందరినీ ఆకట్టుకోలేకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని వర్గాలకు ఈ సినిమా కనెక్ట్ కాదు. కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడేవారికి, రియలిస్టిక్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
