ఆత్రేయ, కాల్.. అంతా రాజమౌళి ఎఫెక్ట్..!

SSMB29 Prithviraj Sukumaran

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ చిత్రం ‘SSMB29’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో పృథ్వీరాజ్ ఎలెక్ట్రిక్ వీల్ చైర్‌లో కూర్చున్నట్లు మేకర్స్ ప్రజెంట్ చేశారు.

గతంలో ఇలాంటి పోస్టర్స్ చాలా సినిమాల్లో కనిపించాయి. అందులో ముఖ్యంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం ‘క్రిష్-3’లో వివేక్ ఓబెరాయ్ చేసిన ‘కాల్’.. తమిళ హీరో సూర్య నటించిన ‘24’ చిత్రంలోని ఆత్రేయ పాత్రలను పోలుస్తూ SSMB29 పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Exit mobile version