గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్ క్రేజీ సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ తర్వాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక చిత్ర బృందం ఇప్పటికే రెండు టీజర్లు విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌గా వస్తున్న ఫస్ట్ సింగిల్ నవంబర్ 14న విడుదల కానున్నట్లు ప్రకటించారు. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ గానం చేశారు. థమన్ ఈసారి కూడా సంగీతంతో చేయడానికి రెడీ అయ్యాడు.
సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. బజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. రామ్ అచంట, గోపీ అచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా ఎం.తేజస్విని నందమూరి ఘనంగా సమర్పిస్తున్నారు.
