నటుడు సుమంత్ తన అమెరికన్ ఫుట్ బాల్ ను ఇక్కడ సపోర్ట్ చేసే పనిలో వున్నాడు. ది ఎలైట్ ఫుట్ బాల్ ఆఫ్ ఇండియా మన దేశంలో అమెరికన్ ఫుట్ బాల్ ను దాని ద్వారా 8 జట్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 20న హైదరాబాద్లో హైదరాబాద్ స్కై కింగ్స్ కు బెంగుళూరు వార్ హాక్స్ మధ్య మొదటి పోటీ జరగనుంది. ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో సుమంత్ హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలిపాడు.
ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడుతూ “నాకు ఎప్పట్నుంచో అమెరికన్ ఫుట్ బాల్ ఆట అంటే ప్రాణం. అద్బుతమైన ఎక్స్ప్రెషన్స్, ఆహ్లాదకరమైన సంఘటనలు మరియు ఎప్పటికీ మరిచిపోలేని ఎన్.ఎఫ్.ఎల్ థీమ్ ట్యూన్. నేను హైదరాబాద్ జట్టుకు అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా ఆనందంగా వుంది. వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను. ఈ ఏడాదికి మేటి జట్టుగా నిలుస్తుందనే నమ్మకం నాకుందని” తెలిపాడు.
గత ఏడాది లక్ష్మి మంచు ఈ.ఎఫ్.ఎల్.ఐ కు ప్రచారకర్తగా ఎంపికయ్యింది. మన నటులు నెమ్మదిగా ఈ మార్గంలోకి ప్రవేశించడం శుభసుచికమే