ఫిబ్రవరి 20 నుంచి ఎగరడానికి సిద్దమవుతున్న సుమంత్

ఫిబ్రవరి 20 నుంచి ఎగరడానికి సిద్దమవుతున్న సుమంత్

Published on Feb 8, 2013 11:45 AM IST

Emo-Gurram-Egara-Vachu
చంద్ర సిద్దార్థ్ డైరెక్షన్లో సుమంత్ హీరోగా రానున్న సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మదన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20 నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా గురించి చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ ‘ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఈ సినిమా నాకు ఒక చాలెంజ్’ అనీ అన్నాడు.

ఎస్.ఎస్ కాంచీ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించాడు. ముందుగా కాంచీనే డైరెక్ట్ చేయాలనుకున్నాడు కానీ చివరిగా ఆ అవకాశం చంద్ర సిద్దార్థ్ కి దక్కింది. ఇప్పటికి మూడు పాటలు రికార్డ్ చేసారు, అలాగే ఈ సినిమాలోని కొంత భాగాన్ని అమెరికాలో షూట్ చేయనున్నారు. ఇంకా హీరోయిన్ ఖరారు కాని ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు

తాజా వార్తలు