మంచు విష్ణు – సులేమాన్ – కృష్ణ శాస్త్రి

మంచు విష్ణు – సులేమాన్ – కృష్ణ శాస్త్రి

Published on Oct 16, 2012 8:15 AM IST


మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘దేనికైనా రెడీ’ ఇటీవలే ఆడియో విడుదలైన ఈ చిత్రం దసరా కానుకగా వచ్చే వారం విడుదలకు సిద్ధం అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న విష్ణు ఈ చిత్రంలో సులేమాన్ – కృష్ణ శాస్త్రి అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయని విష్ణు చెబుతున్నారు జీవితంలో ఒక లక్ష్యం ఉండటం గొప్ప కాదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి కనుక్కోవాలి. ఆ దారిలో ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు అన్ని ఎదుర్కోవాలి. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి. సులేమాన్, కృష్ణ శాస్త్రి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారా లేదా అన్నది తెర పైన చూడండి అంటున్నాడు విష్ణు. విష్ణు సరసన హన్సిక నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. గతంలో సీమ టపకాయ్, సీమ శాస్త్రి వంటి సినిమాలని అందించిన జి. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు