అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను అక్టోబర్ రెండో వారం నుండి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట బన్నీ – రష్మిక పై ఒక సాంగ్ ను షూట్ చేస్తారట. ప్రస్తుతం ఈ సాంగ్ కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో సెట్స్ కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను రాజుసుందరం మాస్టర్ నేతృత్వంలో తీయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సాంగ్ తరువాత సినిమాలోని కీలక సీక్వెన్స్ అయినా అడవిలోని ఛేజింగ్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి ఉంది. ఇక ‘పుష్ప’ సినిమాతో బన్నీ – సుకుమార్ మరో భారీ హిట్ కొడతారా చూడాలి. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.