సుకుమార్ బర్త్ డే వీడియో బన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

సుకుమార్ బర్త్ డే వీడియో బన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

Published on Jan 12, 2020 7:30 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న అల వైకుంఠపురంలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బన్నీ పాత్రలోని వేరియేషన్స్..త్రివిక్రమ్ మార్క్ క్లాస్సీ టచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించిందని టాక్.

కాగా బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఓ వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ కూడా ఊర మాస్ డి గ్లామర్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఐతే నిన్న సుకుమార్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఓ చిన్న మేకింగ్ వీడియో లాంటిది విడుదల చేశారు. దట్టమైన అడవులలో అందమైన లొకేషన్స్ తో కూడిన ఆ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసేదిగా ఉంది. ఈ చిత్రం దాదాపు అటవీ ప్రాంతంలో సుకుమార్ తెరకెక్కించనున్నాడని అర్థం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు