మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లోతెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ కి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 40శాతం వరకు పూర్తికాగా దసరాకు విడుదల చేయాలని భావించారు. ఐతే ఆచార్య మూవీ దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ మూవీకి కూడా చిరంజీవి ప్రణాళికలు వేస్తున్నారు. ఇక మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ ఆయన నెక్స్ట్ మూవీస్ లిస్ట్ లోఉంది.
ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ దక్కించుకుంది. ఈ సినిమా దర్శకుడు సుజీత్ తో చిరు చేయనున్నాడు. దీనితో స్క్రిప్ట్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసే బాధ్యత సుజీత్ కి అప్పగించారు. ఐతే అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్ర తెలుగు వెర్షన్ లో చిరు చేస్తుండగా కథలో భారీ మార్పులే జరుగుతున్నాయట. చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సుజీత్ తెలుగు వర్షన్ లో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా మెగాస్టర్ కెరీర్ లో మరో భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.