‘ఓజీ 2’లో అకీరా నందన్.. సుజీత్ ఏమన్నాడంటే..?

‘ఓజీ 2’లో అకీరా నందన్.. సుజీత్ ఏమన్నాడంటే..?

Published on Sep 26, 2025 11:00 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు సుజీత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ‘ఓజీ 2’ చిత్రంపై అభిమానుల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి.

ఓజీ 2 ఒకవేళ నిజంగా పట్టాలెక్కితే, అందులో పవన్ చేస్తాడా అనే అనుమానం పలువురిలో నెలకొంది. ఇక ఓజీలో అకీరా నందన్ నటిస్తాడనే వార్తలు చాలా వినిపించాయి. దీంతో ఇప్పుడు ఓజీ 2లో కచ్చితంగా అకీరా నందన్ నటిస్తాడనే టాక్ వినిపిస్తోంది. కానీ, సుజీత్ ఈ విషయంపై చాలా క్లారిటీగా ఉన్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఈ విషయం పవన్ గారినే అడగాలి. అకీరా నటిస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుతం అందరూ OG మేనియాలో ఉన్నారు. కొన్ని రోజులు గడిచాక OG 2 గురించి పూర్తి వివరాలు చెబుతాను. కొన్ని సార్లు అకీరా మా సెట్స్‌కి వచ్చాడు. అతనిలో ఒక స్పార్క్ ఉంది. ఇప్పటికైతే అంతే చెప్పగలను. ఇంకా ఏమైనా చెబితే అది ఎక్కువైపోతుంది” అని సుజీత్ అన్నాడు. దీంతో అకీరా నందన్ OG 2లో భాగమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తాజా వార్తలు