‘‘కాంతార”తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, ఇప్పుడు ప్రీక్వెల్ చిత్రం ‘కాంతార : చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ వేడుకను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న మేకర్స్ ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకొస్తున్నారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వారు చేశారు. సెప్టెంబర్ 28న సాయంత్రం 5 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్, హైదరాబాద్‌లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి ఈ ఈవెంట్ అభిమానుల హోరుతో దద్దరిల్లడం ఖాయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.