బాహుబలి ఫ్రాంచైజీ లో కట్టప్ప పాత్ర అత్యంత కీలకమైనది. బాహుబలి: ది కంక్లూజన్ లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు హతం చేశాడో?” అనే ప్రశ్న ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది. సీనియర్ తమిళ నటుడు సత్యరాజ్ ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు.
ఇక ఇప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప జీవితం ఆధారంగా పూర్తి స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనను ఆయన కుమారుడు మరియు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళితో చర్చించారు. కథలో కట్టప్ప వ్యక్తిగత జీవితం, అతను రాజ్యానికి అత్యంత నమ్మకమైన శిష్యుడిగా ఎలా ఎదిగాడు అన్న అంశాలు వర్ణించబడతాయని తెలుస్తోంది.
అయితే, ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దీనిని దర్శకత్వం వహిస్తారా లేదా మరో దర్శకుడికి అప్పగిస్తారా అనేది ఇంకా నిర్ణయించబడ లేదు. దీనికి సంబంధించి త్వరలో మేకర్స్ అధికారికంగా అప్‌డేట్ ఇవ్వనున్నారట.