తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న సుహాసినీ మణిరత్నం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’ లో ఎన్.టి.ఆర్ కి తల్లిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ వర్క్ ను సుహాసినీ పూర్తి చేసారు, ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. గతంలో వచ్చిన ‘రాఖీ’ చిత్రంలో ఎన్.టి.ఆర్, సుహాసినీ కలిసి నటించారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియో ఈ నెల 10న రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల డైరెక్షన్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.