జూలై 23న సుడిగాడు ఆడియో


కామెడీ హీరో ‘అల్లరి’ నరేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “సుడిగాడు”. ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రం యొక్క ఆడియోని జూలై 23న హైదరాబాద్లో విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా ఒక పాట పాడారు. తెలుగులో విజయం సాదించిన 108 చిత్రాల్లోని సన్నివేశాలను తీసుకొని ఈ చిత్రంలో పేరడీ చేశారు. తమిళంలో విజయం సాదించిన “తమిళ్ పడమ్” అనే చిత్రానికి ఇది రిమేక్. ఈ చిత్రంలో నరేష్ సరసన్ మోనాల్ గజ్జర్ కథానాయికగా కనిపించనుంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీ వసంత్ సంగీతం అందించారు. అరుంధతి మూవీస్ బ్యానర్ పై చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version