ఈ కరోనా ప్రవాహంలో రిలీజ్ అయిన మొద్ద మొదటి పెద్ద సినిమా “వి”. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో యాక్షన్ సస్పెన్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో కనులను మెప్పించే యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని అద్భుతంగా చిత్రీకరించారు కెమెరామెన్ పిజి విందా. అయితే, ఆ యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోసింది మాత్రం హీరో సుధీర్ బాబునే అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేసి మరీ, రిస్కీ షాట్స్ లో సుధీర్ బాబు నటించిన విధానం అమోహం.
కాగా సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. సుదీర్ బాబు సినిమాకి మేజర్ అట్రాక్షన్ అయ్యారని, ఆయన చేసిన ఫైట్స్, డ్యాన్స్ లు, అలాగే ఆయన తన పాత్ర పరిధిలో కనబర్చిన నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇందులో మరో వినూత్నమైన పాత్రలో నటించిన నాని కూడా ఎప్పటిలాగే బాగా నటించాడు.
డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.