ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి గ్రాండ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ మరొక కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్ చేసే చేయాలని అనుకుంటున్నారట. ఇదొక యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.
ఇందులో ప్రధాన పాత్రదారులుగా రెజినా, నివేత థామస్ నటిస్తారట. ఇక ఈ రీమేక్ కోసం దర్శకుడిగా సుధీర్ వర్మను అనుకుంటున్నారట. సుధీర్ వర్మ గత చిత్రం ‘రణరంగం’ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆయనకు ఈ రీమేక్ అవకాశం రావడం మంచిదనే అనుకోవచ్చు. అయితే ఈ చిత్రంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.