బాహుబలి బృందంలోకి చేరిన సుదీప్

బాహుబలి బృందంలోకి చేరిన సుదీప్

Published on Jul 15, 2013 9:00 PM IST

Sudeep
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో తన విలనిజంతో ప్రేక్షకులను అబ్బురపరిచిన కన్నడ నటుడు సుదీప్ మరోసారి మన జక్కన్న దర్శకత్వంలో కలిసిపనిచెయ్యనున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుదీప్ రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడని వార్తలొచ్చాయి. ఈ వార్త ఇంకా ఖరారు కాలేదు కానీ సుదీప్ మాత్రం తనకు తెలుగులో భారీ విజయాన్ని అందించిన జక్కన్నతో కలిసి పనిచెయ్యడానికి ఉవ్విలూరుతున్నాడు . “‘బాహుబలి’ షూటింగ్ ఒక గొప్ప అనుభవం, అద్భుతానికే అద్భుతం.. మరోసారి రాజమౌళితో కలిసి పనిచెయ్యడం నా అదృష్టం” అని ట్వీట్ చేసాడు. ‘ఈగ’ సినిమాలోనే కాక సుదీప్ ఈ మధ్యే ‘యాక్షన్ 3డి’ లో సైతం ఒక విభిన్న పాత్రలో నటించాడు.
ప్రభాస్, అనుష్క మరియు రానా నటిస్తున్న ‘బాహుబలి’ అతనికి తెలుగులో నేరుగా 3వ చిత్రం కానుంది. ఈ చిత్రాన్ని అర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు