సింప్లిసిటీకి మరో నిదర్శనం పవన్ కళ్యాణ్

సింప్లిసిటీకి మరో నిదర్శనం పవన్ కళ్యాణ్

Published on May 30, 2012 8:35 AM IST


చాలా రోజుల తరువాత భారీ విజయం ఎవ్వరైనా ఆ విజయాన్ని ఆస్వాదిస్తారు. అది మానవ సహజం. కాని కొందరు మాత్రమే విజయాల్ని, వైఫల్యాలని ఒకేలా స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ ఆ కోవకు చెందిన వారు. విజయం ఆయన్ని ఏ మాత్రం మార్చలేదు. గబ్బర్ సింగ్ ఇటీవలే భారీ విజయం సాధించింది. ఈ విజయం ఆయన ప్రవర్తనలో కాని ఏ మాత్రం తీసుకు రాలేదు. గబ్బర్ సింగ్ విజయాన్ని అయన మీడియాకు దూరంగా తన ఫాం హౌస్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయన తన చిత్ర విజయాల్ని, వైఫల్యాలని ఒకేలా స్వీకరిస్తారని ప్రముఖ నిర్మాత అంటున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించంబోయే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా షూటింగ్ జూన్ 15 నుండి ప్రారంభం కానుంది. బద్రి సినిమా తరువాత వస్తున్న ఈ కాంబినేషన్ పై పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

తాజా వార్తలు