కన్నడలో రీసెంట్‌గా తెరకెక్కిన ‘సు ఫ్రమ్ సో’చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను కామెడీ డ్రామాగా దర్శకుడు జె.పి.తుమినాడ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాను తెలుగులో త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో షనీల్ గౌతమ్, జె.పి.తుమినాడ్, సంధ్య అరకెరె, రాజ్ బి శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ కామెడీ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. దీనికి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.