సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఓ స్టైలిష్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు ఆగష్టు 9న బర్త్ డే జరుపుకోనున్నాడు. అదే రోజు ఫ్యాన్స్ కోసం టీజర్ తో పాటు ‘1- నేనొక్కడినే’ కి సంబందించిన కొన్ని స్పెషల్ పోస్టర్స్ ని రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు లండన్ లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ స్టైలిష్ థ్రిల్లర్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ని సరికొత్తగా చూపించనున్నారని అందరూ ఆశిస్తున్నారు.