తమిళ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వెట్టువాన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్లో విషాదం నెలకొంది.
ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను షూటింగ్ చేస్తున్న తరుణంలో ఓ కార్ స్టంట్‌లో యాక్షన్ స్టంట్ ఆర్టిస్ట్ ఎస్ఎం రాజు మృతిచెందాడు. కారు పల్టీ కొట్టే సీన్‌ను చిత్రీకరిస్తున్న తరుణంలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు కారు వద్దకు పరుగులు తీశారు.
అయితే, ఆయన మృతిచెందడంతో చిత్ర యూనిట్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని నటుడు విశాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఎస్ఎం రాజు కుటుంబానికి అండగా ఉంటానని పేర్కొన్నాడు.