నైజాంలో ‘కూలీ’కి స్ట్రాంగ్ ఓపెనింగ్స్.. మొదటి రోజు సత్తా చాటిన రజినీ సినిమా

COOLIE Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఊహించని హైప్ ని సెట్ చేసుకుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన కూలీ చిత్రం నైజాం మార్కెట్ లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ పి ఆర్ నంబర్స్ ప్రకారం కూలీ చిత్రం 4.15 కోట్ల షేర్ ని (జీఎస్టీ కాకుండా) అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో కూలీ చిత్రంతో మాత్రం సూపర్ స్టార్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని అందుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఈ సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Exit mobile version