సినిమా కథ కొత్తగా ఉంటే.. ఆ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టే. స్టార్ ఎంత బడా స్టార్ అయినా, డైరెక్టర్ ఎంత క్రియేటివిటి ఉన్నవాడు అయినా, కథ బాగుంటేనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అందుకే స్టార్ హీరోలు మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు. స్వయంగా కథలు గురించి ఆరా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా తమకంటూ కథలను తీసుకురావడానికి ఒక టీంను పెట్టుకుంటున్నారు. కొత్త రచయితల నుండి ఏదైనా కొత్త కథ వచ్చిందా అని ఈ టీమ్స్ ఆరా తీస్తున్నాయి.
ఎలాగూ కరోనాతో కావాల్సినంత ఖాళీ టైమ్ దొరికింది అందరికీ. ఈ సమయాన్ని చక్కగా కథల కోసం సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు మన స్టార్ లు. కొంతమంది హీరోలు రచయితలకు లైన్ చెప్పి ఫుల్ స్క్రిప్ట్ రాయిస్తున్నారట. తమకు ఎలాంటి కథలు కావాలో చెప్పి మరీ కథలు రాయిస్తున్నారట. ఇక కొంతమంది స్టార్ హీరోలు గత కొన్ని నెలలుగా తీరిక లేక కొత్త కథలు వినలేకపోయారు. దాంతో కరోనా వల్ల వచ్చిన ఈ తీరిక సమయాన్ని కథలు వినడానికి కేటాయిస్తున్నారట.