కరోనా వైరస్ భయం ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. చాల మంది సీనియర్ నటులు షూటింగ్స్ కి వెళ్లడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా 60ఏళ్ళు పై బడిన నటులు ఎందుకైనా మంచిది జనాలకు దూరంగా ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తాను ఇప్పట్లో షూటింగ్స్ కి హాజరుకాను అంటున్నారు. అలాగే తన కూతురు శ్రద్దా కపూర్ ని కూడా షూటింగ్స్ పంపడట.
తాజాగా ఆయన మాట్లాడుతూ …‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను షూటింగ్స్ లో పాల్గొనాలనుకోవడం లేదు. అలాగే నా కుమార్తెను కూడా షూటింగ్స్‌కి పంపించను . కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. మున్ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనిషి ప్రాణాలకంటే పని ముఖ్యం ఏది కాదు. ఇప్పుడే షూటింగ్స్ ప్రారంభిస్తే పరిస్థితులు మరింత అస్తవ్యస్తంగా మారతాయి. ఇంకొంత సమయం వేచిచూడడం మంచిదని సినీ పరిశ్రమకు చెందిన నా స్నేహితులకు తెలియజేశాను’ అని ఆయన అన్నారు. శక్తి కపూర్ బాలీవుడ్ లో విలన్ మరియు క్యారెక్టర్ రోల్స్ కి బాగా ఫేమస్.