పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా ఒప్పుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు. అయితే క్రిష్ – పవన్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దాని పై చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి లాక్ డౌన్ లో కూడా మరో పేరు తెర పైకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందని తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కేవలం రూమర్ అని తెలుస్తోంది.
కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.