బాలీవుడ్ బడా హీరోలు కలుస్తున్నారా ?

బాలీవుడ్ బడా హీరోలు కలుస్తున్నారా ?

Published on Jan 14, 2020 3:00 AM IST

బాలీవుడ్ పరిశ్రమలో వాతావరణం మారుతోంది. ఇన్నాళ్ళు సోలోగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన స్టార్ హీరోలు చాలామంది ఇప్పుడు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి హీరోల్లో అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పటికే పలువురు హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఆయన ఈసారి స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి పనిచేయనున్నారనే వార్తల వినిపిస్తున్నారు.

ఒక పాపులర్ డైరెక్టర్ వారిద్దరితో ఒక పౌరాణిక చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈమేరకు ఇద్దరు హీరోలను కలిసి చర్చలు కూడా జరిపారని, ఇద్దరు హీరోలు కలిసి వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే వీరి కలయిక టాక్ ఆఫ్ థి టౌన్ కావడం ఖాయం.

తాజా వార్తలు